హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ సొమ్ముతో యజ్ఞాలు చేయడం సిగ్గుచేటు'

TG: నాగార్జున సాగర్‌లో ప్రభుత్వ సొమ్ముతో వరుణ యాగం చేయడం సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. వర్షాభావం, తాగునీటి సమస్యపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాళేశ్వరం నీటిని సద్వినియోగం చేసుకోలేదన్నారు. భయంతోనే సింగిల్ విండో ఎన్నికలను నామినేషన్ పద్ధతిలో తెస్తున్నారని, అధ్వాన్న విద్యుత్ సరఫరాతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శించారు.