హర్యానాలోని గురుగ్రామ్‌లో వర్షపు నీటిలో పడవ నడిపిన ఆన్‌లైన్ సంస్థకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ. 50 వేల జరిమానా విధించి, బోటును స్వాధీనం చేసుకున్నారు. వరద సమస్యను వినూత్నంగా ఎత్తిచూపేందుకు తాము ఈ ప్రయత్నం చేశామని, జరిమానా చెల్లించామని సంస్థ ప్రతినిధి తెలిపారు. సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
పడవతో పబ్లిసిటీ స్టంట్.. ప్రైవేటు సంస్థకు షాక్!


