హైదరాబాద్: 28°C
వార్తలు

సర్వాయి పాపన్నకు నివాళులు

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకల్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పాపన్న గౌడ్ పోరాడారని కొనియాడారు. ఆయన చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు, ధైర్యం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి ఆశయాలను యువత ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.