హైదరాబాద్: 28°C
వార్తలు

కల్చరల్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ

HYD: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'హైదరాబాద్ జిందాబాద్' ఆధ్వర్యంలో నిర్వహించనున్న కల్చరల్ ఫెస్టివల్ ప్రచార పోస్టర్‌ను సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. నగరం భిన్న సంస్కృతులకు నిలయమని, దేశభక్తి, రాజ్యాంగ స్ఫూర్తిని చాటేలా ఆగస్టు 16న రవీంద్ర భారతిలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు.