CTR: తవణంపల్లి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగువ తడకరలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వర్షాలు ఆలస్యమైతే వేరుశనగ, వరికి బదులుగా ఆముదం, రాగి, సజ్జ, పెసలు, మినుములు, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. విత్తన గుళికలు, ద్రవ జీవామృతం తయారీపై రైతులకు ప్రదర్శన నిర్వహించారు.
వార్తలు
ఎల్‌నినోపై రైతులకు అవగాహన


