హైదరాబాద్: 28°C
వార్తలు

మహిళా రక్షణకే తొలి ప్రాధాన్యం: ఎస్పీ

MDK: జిల్లాలో మహిళలు, బాలికల భద్రతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, సందేహాస్పద లింకులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.