హైదరాబాద్: 28°C
వార్తలు

మన్యంలో వేడెక్కిన రాజకీయం

PPM: కురుపాంలో వైసీపీ-కూటమి నేతల మధ్య రాజకీయ రగడ నెలకొంది. ఆరోగ్య కేంద్రాల నిర్మాణం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని వైసీపీ నేతలు ఆరోపించగా, కురుపాం ఎమ్మెల్యే, రాష్ట్ర విప్ జగదీశ్వరి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఆరోగ్య కేంద్రాలు పూర్తై ప్రారంభమయ్యాయని స్పష్టం చేశారు. గిరిజనులను చులకనగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు.