TPT: గోవర్ధనపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదో తరగతి చదివిన ఎస్.కే. సమీరా ఒంగోలు బ్రాంచ్‌లో ఐఐఐటీ సీటు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి రూ.8 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. విద్యార్థిని ప్రతిభను అభినందించిన ఉపాధ్యాయులు, ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
వార్తలు
గోవర్ధనపురం విద్యార్థినికి ఐఐఐటీ సీటు


