HYD: తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట మెట్రో కారిడార్ భూసేకరణపై గతేడాది విధించిన స్టేను ఎత్తివేసింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో పనులకు అనుమతినిచ్చింది. జస్టిస్ శ్రవణ్ కుమార్ తీర్పుతో మెట్రో విస్తరణ పనులకు మార్గం సుగమమైంది. దీంతో హైదరాబాద్‌లో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
వార్తలు
ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట మెట్రోకు గ్రీన్ సిగ్నల్


