హైదరాబాద్: 28°C
వార్తలు

సూరారం వార్డులో కమిషనర్ పర్యటన

HYD: వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గుమ్మళ్ల సృజన సూరారం వార్డులో పర్యటించారు. ఆర్‌డబ్ల్యూఏలు, స్థానికులతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు, పార్కులు, ఆక్రమణలు, పారిశుద్ధ్యం సమస్యలను తెలుసుకున్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.