హైదరాబాద్: 28°C
వార్తలు

'యూరియా బస్తాపై రూ. 30 బాదుడు'

NLG: కట్టంగూర్ PACS కేంద్రంలో యూరియాను అదనపు ధరకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వ ధర ప్రకారం బస్తా రూ. 266 ఉండగా, ట్రాన్స్‌పోర్ట్, హమాలీ చార్జీల పేరుతో మరో రూ. 30 వసూలు చేస్తూ రూ. 296. 60కు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సరఫరా ట్రాన్స్‌పోర్ట్ చార్జీల కారణంగా బస్తాకు రూ. 30 అదనంగా వసూలు చేస్తున్నట్లు సీఈఓ మల్లారెడ్డి తెలిపారు.