హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధికి సీజేపీ పిలుపు

గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 'సీజేపీ' సంస్థ ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చింది. పట్టణాలతో సమానంగా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమని వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. పాఠశాలల్లో విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్ల వసతులను తనిఖీ చేసి, లోపాలుంటే ఫొటోలు, వీడియోలను contact@cockroachjantaparty.orgకు పంపాలని సూచించారు.