హైదరాబాద్: 28°C
వార్తలు

రైతుసేవా కేంద్రాన్ని సందర్శించిన ఎస్ఈ

VZM: వర్షాభావ పరిస్థితులను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం ఎస్ఈ, జిల్లా ప్రత్యేక అధికారి హరిబాబు చౌదరి అన్నారు. ఈ మేరకు మంగళవారం గజపతినగరం మండలం మధుపాడలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు తక్కువగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండి, తక్కువ కాల పరిమిత గల వరి పంటను వేసుకోవాలన్నారు.