హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలిలో రేపు క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం

GNTR: తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో బుధవారం క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు కమిషనర్ రామ అప్పలనాయుడు తెలిపారు. విద్యార్థులతో రణరంగ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పట్టణ ప్రజలు హాజరుకావాలని కోరారు.