RR: కేశంపేట (మం) కొండారెడ్డిపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మండల కన్వీనర్ కానం ఉదయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పుట్నాల సాయికుమార్, కంచుకోట మహేష్, కొక్కల కుమారస్వామి, బూత్ అధ్యక్షుడు సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
కొండారెడ్డిపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం


