TG: ఆదిలాబాద్ విమానాశ్రయ పనులు వేగవంతమయ్యాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి అనుకుంట గ్రామంలో భూ సర్వే పనులు ప్రారంభమయ్యాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ సర్వే నెల రోజుల పాటు కొనసాగనుంది. విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2009 ఎకరాల భూమిని కేటాయించగా, భూముల సేకరణ నిమిత్తం రూ.1500 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
ఆదిలాబాద్ విమానాశ్రయ భూసర్వే షురూ


