GNTR: తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం శైవక్షేత్రం సమీపంలో కృష్ణానది తీరానికి ఒక మొసలి రావడంతో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నదిలో విద్యుత్ హైటెన్షన్ టవర్ పనుల్లో నిమగ్నమైన కార్మికులు ఈ మొసలిని ప్రతీక్షంగా చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నది ఒడ్డున కొద్దిసేపు అలజడి సృష్టించిన ఆ మొసలి, ఆ తర్వాత తిరిగి నీటిలోకి ఈదుకుంటూ వెళ్లిపోయింది.
వార్తలు
తుళ్లూరు వద్ద కృష్ణానదిలో ప్రత్యక్షమైన మొసలి


