హైదరాబాద్: 28°C
వార్తలు

'మార్పు కోసమే CPI పోరు యాత్ర'

MNCL: మార్పు కోసమే సిపిఐ పోరు యాత్ర చేపట్టడం జరిగిందని సిపిఐ జిల్లా నాయకులు మేకల దాసు అన్నారు. పోరు యాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పోరు యాత్ర ఉంటుందని, అందులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు.