లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను సజావుగా నడిపేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. సభలో ప్లకార్డుల ప్రదర్శన సరికాదని హితవు పలికారు. ప్రజలు అర్థవంతమైన చర్చ చూడాలని కోరుకుంటున్నారని విపక్షాలు నినాదాలు ఆపాలని కోరారు. అయినా సభ్యులు వినకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తునట్లు ప్రకటించారు.
వార్తలు
ప్రతిపక్ష సభ్యులపై ఓం బిర్లా ఆగ్రహం


