BPT: కర్లపాలెం మండలంలోని కట్టవాద పంప్‌హౌస్ వద్ద జరిగిన దొంగతనం ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు ఎస్సై రవీంద్ర ఆదేశాలతో కానిస్టేబుల్ శివశంకర్ మంగళవారం ఘటనా స్థలానికి వెళ్లారు. చోరీ జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆధారాల కోసం అన్వేషించారు. దొంగలను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వార్తలు
కట్టవాద పంప్‌హౌస్ వద్ద చోరీ..!


