అన్నమయ్య: వెలిగల్లు ప్రాజెక్ట్ కుడి కాలువకు ఈ నెల 13న ఉదయం 9 గంటలకు నీటిని విడుదల చేయనున్నారు. రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నీటిని విడుదల చేయనున్నారు. రైతులకు సాగునీరు అందించడంలో ఈ నీటి విడుదల కీలకంగా మారనుంది. కార్యక్రమానికి అధికారులు హాజరై విజయవంతం చేయాలని ప్రాజెక్ట్ ఏఈ ఎం. సాంబశివుడు కోరారు.
వార్తలు
వెలిగల్లు కుడి కాలువకు నీరు విడుదల


