హైదరాబాద్: 28°C
వార్తలు

19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల

పంద్రాగస్టు వేళ ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు పోలీసులు విడుదల చేశారు. మొత్తం 19 మంది ఉగ్రవాదుల ఫొటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇండియన్ ముజాహిదీన్, అల్-ఖైదా, బాబర్ ఖల్సా తదితర నిషేధిత సంస్థల అనుమానితుల ఫొటోలు ఆ పోస్టర్లలో ఉన్నాయి. వీరు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.