హైదరాబాద్: 28°C
వార్తలు

నకిలీ న్యాయవాదులు.. 39 మందిపై కేసు

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో నకిలీ న్యాయవాదులను గుర్తించారు. 3 రోజుల్లో తప్పుడు సర్టిఫికెట్లు ఉన్న 39 మంది న్యాయవాదులను గుర్తించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ మార్క్‌షీట్లతో వీరు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టిస్ కూడా పొందినట్లు అధికారులు తెలిపారు. ఇలా మొత్తం 105 మందిపై ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.