హైదరాబాద్: 28°C
వార్తలు

కాగజ్‌నగర్‌లో ఊపందుకున్న సాగు పనులు

ASF: కాగజ్ నగర్ మండలంలో సాగు పనులు ఊపందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు కుంటలు చెరువులు ప్రవహిస్తుండడంతో రైతన్నలు సాగు పనులను ముమ్మరం చేశారు. మండల వ్యాప్తంగా 26 వేల ఎకరాల్లో పత్తి సాగు ఉండగా 6 వేల ఎకరాల్లో వరి, 2వేల ఎకరాల్లో కూరగాయలు, 1500 ఎకరాల్లో కంది పంటను సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు.