మహారాష్ట్రలో స్వల్ప భూకంపం సంభవించింది. పాల్ఘర్ జిల్లాలో రాత్రి వరుసగా రెండు సార్లు భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో రెండు భూకంపాలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని చెప్పారు. ఈ కుదుపుల కారణంగా ప్రజలు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.
వార్తలు
మహారాష్ట్రలో స్వల్ప భూకంపాలు


