హైదరాబాద్: 28°C
వార్తలు

వేంపల్లెలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు

KDP: వేంపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం CI నరసింహులు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న ఆక్రమణలను గుర్తించి తొలగించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.