హైదరాబాద్: 28°C
వార్తలు

యువకుడు ఆత్మహత్య.. రిజర్వేషన్లపై రగడ

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లపై మరోసారి రగడ మొదలైంది. పర్భణీ జిల్లాలో ఉరేసుకుని గణేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రిజర్వేషన్లు దక్కడం లేదని మనస్తాపంతో బలన్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు సూసైడ్ నోట్ రాయగా.. దానిని అధికారులు తన బేజులో గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.