హైదరాబాద్: 28°C
వార్తలు

'పత్తి దిగుబడి తగ్గడానికి కారణాలివే'.. కేంద్రం నివేదిక

TG: రాష్ట్రంలో పత్తి ఉత్పాదకత తగ్గడానికి ప్రతికూల వాతావరణం, చీడపీడలు, నాణ్యతలేని విత్తనాలు, సాగు వ్యయం పెరగడమే ప్రధాన కారణమని కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఫలితంగా 2021-22లో 30.42 లక్షల టన్నులు ఉన్న పత్తి ఉత్పత్తి, 2025-26 నాటికి 24.70 లక్షల టన్నులకు పడిపోయింది. గిట్టుబాటు ధర రాకపోవడం కూడా రైతులను మరింత కుంగదీస్తోందని వార్షిక నివేదిక వెల్లడించింది.