NZB: ఇందల్వాయి లింగాపూర్ హై లెవల్ బ్రిడ్జి వద్ద గుంతలు పూడ్చేందుకు పోసిన మొరం వర్షాలకు బురదగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ఎప్పుడు, ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే రహదారినీ సరి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
VIDEO: బ్రిడ్జి వద్ద బురదమయం.. పొంచి ఉన్న ప్రమాదం


