JGL: జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాక్టర్ డ్రైవర్ బందెల రమేష్ మృతి కేసులో ప్రధాన నిందితుడు గడ్డం గంగారెడ్డి(35)ని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జీతం విషయంలో వివాదంతో రమేష్‌పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. గంగారెడ్డి వద్ద రెండు ఫోన్లు, స్కూటీ, బెల్ట్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు అజయ్‌రావు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
వార్తలు
ట్రాక్టర్ డ్రైవర్ మృతి కేసు.. నిందితుడి అరెస్ట్


