హైదరాబాద్: 28°C
వార్తలు

నిజాంపేట్‌లో బైక్ దగ్ధం

SRD: నిజాంపేట్‌ మండలంలోని బాచేపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి బేతిగారి సాయిలుకు చెందిన గ్లామర్‌ బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఇంటి వద్ద నిలిపి ఉంచిన బైక్‌ను తీసుకెళ్లి కొంతదూరంలో నిప్పంటించినట్లు సమాచారం. బైక్‌ పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.