PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ గోదావరిఖని గంగానగర్‌లో మేయర్ మహంకాళి స్వామి అధికారులతోకలిసి పర్యటించారు. ప్రధాన మురికి కాలువలో పేరుకుపోయిన పూడికను జేసీబీతో తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రహదారుల వెంట ఉన్న పొదలు, చెత్తను శుభ్రం చేయించారు. స్థానికులను కలిసి సమస్యలు తెలుసుకుని,అత్యవసర అంశాలపై సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
గంగానగర్‌లో మేయర్ పర్యటన


