హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పైప్‌లైన్ లీకేజీ.. నీరు వృథా

VSP: ఎండాడలో భూగర్భ జలాల పైప్‌లైన్‌ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. గత మూడు రోజులుగా లీకేజీ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎండాడలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండగా, ఇలా నీరు వృథా అవుతుండటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీకేజీని అరికట్టి నీటి వృథాను నిలిపివేయాలని కోరుతున్నారు.