KNR: గంగాధర కురిక్యాల బొమ్మలమ్మగుట్టలో ప్రాచీన కాలం నాటి విశేషాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గుట్టపై తెలుగు, కన్నడ, సంస్కృత లిపులకు సంబంధించిన ఆధారాలు ఉండటంతో చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. 10వ శతాబ్దానికి చెందిన జైన శిల్పాలు, చక్రేశ్వరీ దేవి ప్రతిమ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యాటకుల సౌకర్యార్థం గుట్టపైకి మెట్ల నిర్మాణం చేపట్టారు.
వార్తలు
ఆకట్టుకుంటున్న ప్రాచీల కాలం నాటి విశేషాలు


