హైదరాబాద్: 28°C
వార్తలు

వివాదాస్పద స్థలంలో కూల్చివేతలు

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రహత్ నగర్ కాలనీలో మున్సిపల్ కార్యాలయానికి చెందిన ఇన్ లేట్ వెల్ ప్రాంతాన్ని అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కూల్చివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలవు దినాలను అదునుగా భావించి అక్రమంగా కూల్చివేతలు చేపట్టారని, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.