దేశంలో నదుల అనుసంధానానికి అవకాశమున్న 30 నదీ జల ప్రాజెక్టులను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. అందులో కేవలం కెన్-బెట్వా ప్రాజెక్టు ఒక్కటే అమలు దశకు చేరుకుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌధరి రాజ్యసభలో చెప్పారు. ఈ కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు రూ.44,605 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు పేర్కొన్నారు.
వార్తలు
30 నదీ అనుసంధాన ప్రాజెక్టులకు అవకాశం: కేంద్రం


