హైదరాబాద్: 28°C
వార్తలు

స్లోవేనియాకు భారత్‌ నిరసన

స్లోవేనియా ల్యుబ్లియానాలోని రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. అక్కడి గోడలపై రాసిన రాతలను తప్పుబట్టింది. వియన్నా ఒప్పందం ప్రకారం, దౌత్య కార్యాలయాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల విధి అని గుర్తుచేసింది. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినవారిని జవాబుదారులను చేయాలని డిమాండ్ చేసింది. ఈ చర్యలో కొందరు ఖలిస్థాన్ అనుకూల శక్తులు ప్రమేయం ఉన్నట్లు సమాచారం.