హైదరాబాద్: 28°C
వార్తలు

మానవత్వం చాటుకున్న మంత్రి సుభాష్

కోనసీమ: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన సేవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. సోమవారం అనారోగ్యంతో బాధపడుతున్న దొమ్మలపాటి నాగలక్ష్మికి రూ. 20 వేలు, కొండయ్యపాలెం వెంకన్న బాబుకు రూ.10 వేలు చొప్పున మొత్తం రూ. 30 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలకు తనవంతు సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని మంత్రి తెలిపారు.