హైదరాబాద్: 28°C
వార్తలు

పోగొట్టుకున్న వస్తువులు అప్పగించిన పోలీసులు

GDWL: మల్దకల్ మండలం మంగంపేటకు చెందిన ప్రభుత్వ లైసెన్స్‌ సర్వేయర్‌ కురువ వెన్నయ్య జులై 11న బైక్‌పై గద్వాలకు వెళ్తుండగా అమరవాయి–బూడిదపాడు మధ్య బ్యాగు పోగొట్టుకున్నారు. అందులో రూ.15 వేల విలువైన వివో ఫోన్‌, రూ.50 వేల విలువైన సర్వే మిషన్‌ ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని గుర్తించిన మల్దకల్‌ పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితుడికి అప్పగించారు.