హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిర్‌టెల్‌తో చేతులు కలిపిన ఐటీఐ

సంస్థలకు డిజిటల్ సొల్యూషన్స్ అందించేందుకు ఎయిర్‌టెల్ బిజినెస్, టెలికాం రంగ ప్రభుత్వ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ సహకారంతో డిఫెన్స్‌తో పాటు ప్రభుత్వ రంగంలో వాటాను పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. దీని ద్వారా కనెక్టివిటీ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సేవలు, ఏఐ-ఆధారిత అనలిటిక్స్ వంటి అధునాతన సేవలను అందించనున్నారు.