హైదరాబాద్: 28°C
వార్తలు

'డీపీఆర్ వెనక్కి పంపడం దుర్మార్గం'

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడం దుర్మార్గమని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్ర పాలకుల కోసం తెలంగాణ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, BJP కపట నాటకాలు మాని, DPR ఆమోదం కోసం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.