హైదరాబాద్: 28°C
వార్తలు

పులి సంచారం అవాస్తవం: సీఐ శ్రీనివాస్

AP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నగదిలి కొండ ప్రాంతంలో పులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నకిలీదని సీఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సహచరులను భయపెట్టేందుకు ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ ఫోటోను చూపించిన అప్పలరాజును అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఫేక్ వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.