హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ వర్షం

TG: హైదరాబాద్‌లో అర్థరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.