మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో గిరిజన బాలికల పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న ఆరుగురు విద్యార్థినులను పాము కాటు వేసింది. ఈ ప్రమాదంలో గడ్చిరోలి జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను హెలికాప్టర్ ద్వారా నాగపూర్‌కు తరలించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
పాము కాటుకు ముగ్గురు విద్యార్థినులు మృతి


