హైదరాబాద్: 28°C
వార్తలు

గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్య పరీక్షలు

BPT: కారంచేడు (మం) స్వర్ణ ప్రభుత్వ వైద్యశాలలో సోమవారం ‘ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు రక్తం, షుగర్, బీపీ తదితర ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ షాలిని హస్సప్రియ గర్భిణులకు పలు సూచనలు చేయగా, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.