హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీ తీరుపై జేపీ నడ్డా ఆగ్రహం

పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహారశైలిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో చర్చలు జరగకుండా గందరగోళం సృష్టించడమే ఆయన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సజావుగా సాగకూడదనే ఉద్దేశంతోనే రాహుల్ నిరంతరం అడ్డుతగులుతున్నారని అన్నారు. విద్యార్థుల నిరసనలపై సభలో వివరణ ఇచ్చేందుకు అమిత్ షా సిద్ధంగా ఉన్నారని తెలిపారు.