ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం జరిగిన పెళ్లిళ్లకు ప్రత్యేక వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ముస్లిం వివాహాలకు షరియా చట్టమే వర్తిస్తుందని పేర్కొంది. 'స్పెషల్ మ్యారేజ్ యాక్ట్' కింద వివాహాన్నిరిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన.. ముస్లిం పర్సనల్ లా రద్దు అయిపోదని తేల్చిచెప్పింది.
వార్తలు
ముస్లిం వివాహాలపై హైకోర్టు కీలక తీర్పు


