UP ఘజియాబాద్‌లోని యశోద మెడిసిటీ హాస్పిటల్ వైద్యులు ఓ వ్యక్తి తెగిన చేతిని విజయవంతంగా అతికించారు. నిర్మాణ సంస్థలో పనిచేసే హాపూర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడి కుడి చేయి ఓ యంత్రంలో ఇరుక్కుపోయి మణికట్టు వరకు పూర్తిగా తెగిపోయింది. దీంతో తెగిన చేతితో పాటు అతడిని వెంటనే యశోద హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు 7 గంటల పాటు శ్రమించి తెగిన చేతిని విజయవంతంగా అతికించారు.
వార్తలు
తెగిన చేతిని అతికించిన డాక్టర్లు


