BPT: పర్చూరు టీడీపీ పార్టీ మండల అధ్యక్షునిగా కొల్లా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఉప్పుటూరు నరేంద్రను ఎంపిక చేసినట్లు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయం తెలిపింది. పర్చూరు మండలంలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన నాయకులు పేర్కొన్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
వార్తలు
పర్చూరు టీడీపీ మండల అధ్యక్షునిగా శ్రీనివాసరావు


