హైదరాబాద్: 28°C
వార్తలు

అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

విద్యార్థులపై పోలీసుల చర్యపై హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో సమాధానం ఇవ్వాలని రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్లు, ముళ్లు ఉన్న బ్యాటన్లు, టియర్ గ్యాస్‌తో విద్యార్థులపై దాడులు జరిగాయని ఆయన తెలిపారు. దీనిపై అమిత్ షా విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. పార్లమెంటు సమావేశాలు 20 రోజులుగా జరుగుతున్నా హోం మంత్రి సభకు రాలేదని విమర్శించారు.